బీసీసీఐ నిబంధనలు అతిక్రమించిన టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వరల్డ్‌‌‌‌కప్‌ లో బీసీసీఐ నిబంధనలు అతిక్రమించిన టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఒకరు వివాదంలో ఇరుక్కున్నాడు. త్వరలో కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీఓఏ) విచారణ ఎదుర్కొనున్నాడు. వరల్డ్‌‌‌‌కప్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు తమ భార్యతో 15 రోజులు మాత్రమే కలిసి ఉండడానికి సీఓఏ అనుమతి ఇచ్చింది. అయితే జట్టులోని ఓ సీనియర్ ప్లేయర్‌ వెంట అతని భార్య దాదాపు ఏడు వారాలు పాటు ఉంది. ఇందుకోసం అతను కెప్టెన్‌ లేదా కోచ్‌ నుంచి అనుమతి తీసుకోలేదు.తన భార్య తన వెంట మరిన్ని రోజులు ఉండేందుకు అనుమతివ్వా లంటూ సదరు ప్లేయర్‌ చేసిన విజ్ఞప్తిని మే3న జరిగిన సమావేశంలోనే సీఓఏ తిరస్కరిచింది. అయినా ఆ ప్లేయర్‌ , భార్యతో కలిసి ఉన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్నిసీఓఏకి ఫిర్యాదు చేయవలసిన బా ధ్యత జట్టు అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ సునిల్‌ సుబ్రమణియన్‌ ది. కానీ, అతను ఎందుకు సమాచారం ఇవ్వలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై మేనేజర్‌ నుంచి సీఓఏ వివరణ కోరే అవకాశముందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.