మాల్యా అప్పగింత కేసు విచారణ ఇక వచ్చే ఏడాదే

వాస్తవం ప్రతినిధి: బ్యాంకులను వేల కోట్ల రూపాయిలు మోసం చేసి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌మాల్యా తనను భారత్‌కు అప్పగించడాన్ని సవాల్‌ చేస్తూ యుకె హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై 2020 ఫిబ్రవరిలో విచారణ జరుపనున్నది. మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ చేసుకోవడానికి అతడికి లండన్‌లోని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌లోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ 2020 ఫిబ్రవరి 11న జరుగుతుందని యుకె హైకోర్టు అధికారులు చెప్పారు.