టీడీపీ బాలయ్య చేతిలోకి వెళితే బాబు కి లాభమా నష్టమా ?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీని తిరిగి పుంజుకోచేయటానికి నానా తంటాలు పడుతున్నారు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి నారా చంద్రబాబునాయుడు స్కెచ్ వేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జగన్ ధాటికి ఏపీలో టిడిపి పార్టీకి గల్లంతైన విషయం మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా రాయలసీమ అయితే టిడిపి పార్టీకి కొద్ది స్థానాల్లో మాత్రమే గెలవడం జరిగింది. ఇటువంటి క్రమంలో జగన్ దాటిని ఎదుర్కొని అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారి కుమారుడు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో పార్టీ బాధ్యతలను నందమూరి బాలకృష్ణ చేతిలో పెట్టడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో టిడిపి బాలయ్య చేతిలో కి వెళితే…ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా బాలయ్య రియాక్ట్ అవుతారో ఎవరికి తెలియదు. అలాగే భవిష్యత్తులో నందమూరి కుటుంబానికి చెందినవారు చంద్రబాబుపై తిరగబడే చాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి దీని వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం చంద్రబాబుకే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.