వెంకయ్య నాయుడు కి అతిపెద్ద ఇబ్బంది !

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు డీఎస్ తీరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గతంలో డీఎస్ పార్టీలో ఉండగానే బహిరంగంగానే అధిష్టానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా తాను ఏ పార్టీ నుండి వచ్చాడో అనగా కాంగ్రెస్ పార్టీకి డీఎస్ అప్పట్లో వెళ్లడానికి సిద్ధమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవడంతో..కొన్నాళ్ళ వరకు కామ్ అయిపోయారు డీఎస్. అయితే ఇటీవల దేశవ్యాప్తంగానూ మరియు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో డీఎస్ తనయుడు బిజెపి పార్టీ నుండి గెలవడంతో ఇటీవల తన తనయుడు అభినందన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని షాకింగ్ కామెంట్ చేశారు డీఎస్. ఇదే సమయంలో అమిత్ షా తో కూడా సమావేశమయ్యారు. ఈ పరిణామంతో డీఎస్ బీజేపీకి మరింత దగ్గరయ్యారు. దీంతో రాజ్యసభలో తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. అందులో భాగంగా డీఎస్ ను కూడా చేర్చుకున్నా చేర్చుకోవచ్చు. ఈ లోపే ఆయనపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అనే అభియోగంతో ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతోందట టీఆర్ ఎస్. మొత్తం మీద ఈ పరిణామం రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడికి పెద్ద ఇబ్బందికరంగా మారింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు డి ఎస్ ఫై అనర్హత వేటు వేస్తారా లేదో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.