బుగ్గన ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ పై మాజీ ఆర్థికమంత్రి యనమల వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ ప్రచారం ఎక్కువ.. పస తక్కువ అన్న చందంగా ఉందన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. బడ్జెట్ పై మాట్లాడిన యనమల అప్పులపై మా ప్రభుత్వంపై ఎన్నో మాట్లాడారని.. ఇప్పుడు వీళ్ళు సుమారు 48 వేలకోట్లు అప్పు తెచ్చేందుకు సిద్దపడ్డారన్నారు. వడ్డీలేని రుణాలని చాలా హడావుడి చేసి కేవలం వందకోట్లు పెట్టారని, సాంఘీక సంక్షేమానికి నిధులు బాగా తగ్గించారన్నారు. వ్యవసాయ రంగానికి అంతంత మాత్రంగానే కేటాయించారన్నారు.