మలేషియా లో విశాఖ జిల్లా వ్యక్తి మృతి

వాస్తవం ప్రతినిధి: మలేషియాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖ జిల్లా వ్యక్తి మృతిచెందడం కలకలం రేపుతోంది. జిల్లాలోని గాజువాక టీవీఎన్ కాలనీకి చెందిన సూర్యనారాయణ కొంత కాలం క్రితం విజిటింగ్ వీసాతో మలేషియా వెళ్లాడు. విజిటింగ్ వీసా గడువు పూర్తయినా కూడా ఇండియాకు రాకుండా వేరొక కంపెనీలో పని చేస్తూ సూర్యనారాయణ అక్కడే ఉండిపోయాడు. అయితే తాజాగా ఆయన బాత్‌రూంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో పడిపోయి మృతిచెందాడు.