ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్ కు చేరుకొన్న ఇంగ్లాండ్

వాస్తవం ప్రతినిధి: వరల్డ్ కప్ లో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ 49 ఓవర్లకు 223 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 224 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి 2 వికెట్ల నష్టంతో 321 ఓవర్లకే అలవోకగా ఛేదిందించింది. ఇంగ్లాండ్ జట్టులో బెయిర్ స్టో 34 పరుగులతో, రాయ్ 85 పరుగులతో, రూట్ 49 పరుగులతో, మోర్గాన్ 45 పరుగులతో రాణించారు. స్టార్క్, కమిన్స్ చెరో వికెట్ తీశారు.