స్క్రిప్ట్ తీసుకొచ్చిన బోయపాటి తో దిల్ రాజు ఏమన్నాడో తెలుసా ?

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో కెరీర్ స్టార్టింగ్ సమయంలో కేవలం కుటుంబ కథా చిత్రాలను మాత్రమే నిర్మించేవారు. అయితే ప్రేక్షకులలో ఆలోచనా ధోరణి మారుతున్న నేపథ్యంలో ఎక్కువగా డిఫరెంట్ సబ్జెక్టులకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్న క్రమంలో నిర్మాత దిల్ రాజు తన ధోరణి కూడా మార్చుకున్నాడు. ఎటువంటి సబ్జెక్టుతో వచ్చినా నిర్మించడానికి సిద్ధమే అని దిల్ రాజు డోర్స్ ఓపెన్ చేశారు. దీంతో అన్ని రకాల దర్శకులకు వెల్కమ్ బోర్డు పెట్టారు. అయితే ఇక్కడ తిరకాసు ఏమిటంటే తనకి కథ చెప్పే డైరెక్టర్ కి మాత్రం సినిమా బడ్జెట్ డిసైడ్ చేసే అవకాశం ఇవ్వరు. డైరెక్టర్ చెప్పిన సబ్జెక్ట్‌ విని నచ్చితే దానికి ఎంత ఖర్చు పెడితే వర్కవుట్‌ అవుతుందనేది దిల్‌ రాజు డిసైడ్‌ చేస్తాడు. ఎంత క్రేజీ ప్రాజెక్ట్‌ అయినా కానీ బడ్జెట్‌ ఫిక్స్‌ చేసుకుని డిస్కస్‌ చేయడం రాజుకి అస్సలు నచ్చదు. ఆమధ్య భారతీయుడు సీక్వెల్‌ తీయడానికి దిల్‌ రాజు ఉత్సాహపడ్డాడు కానీ శంకర్‌ బడ్జెట్‌ గురించి మాత్రమే మాట్లాడుతుంటే దిల్‌ రాజు గౌరవంగా తప్పుకున్నాడు. ఇటువంటి క్రమంలో తాజాగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా దిల్ రాజుతో కలిసి ఒక ప్రాజెక్టు నిర్మించడానికి రెడీ అయ్యి స్క్రిప్టు తీసుకువస్తే ముందుగానే సినిమా నచ్చితే…తానే బడ్జెట్ డిసైడ్ చేస్తానని…ఖరాఖండీగా చెప్పేయడంతో బోయపాటి ఏం చేయాలో తెలియక వెను తిరిగి వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.