బన్నీ కి సెల్ఫ్ భజన ఎక్కువైందా ?

వాస్తవం సినిమా: మెగా కాంపౌండ్ హీరో లో ఎక్కువగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట తీరు పై అనేకసార్లు సోషల్ మీడియాలో మెగా అభిమానుల హీరోలే మండి పడిన సందర్భాలు ఉన్నాయి. గతంలో’ పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ చేసిన కామెంట్ పట్ల ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇటువంటి క్రమంలో సోషల్ మీడియాలో తనపై విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలివిగా తనకంటూ సోషల్ మీడియా టీం నీ ఏర్పాటు చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ టీం..అల్లు అర్జున్ కి సంబంధించిన విశేషాలు అన్నిటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బండి ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తుంటారు. బన్నీ ఏదైనా సినిమా చూసి ,ఆ టీంను అభినందించినా.. ఏదైనా వేడుకకు హాజరైనా.. బయట ఏదైనా వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్నా ఆ విషయాలను ఓ రేంజిలో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా ఇటీవల బన్నీ తన గురించి తానే సొంతగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో..బన్నీ కి సెల్ఫ్ భజన ఎక్కువైందని…అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విషయంలోకి వెళితే బన్నీ వ్యానిటీ వ్యాన్ ‘ఫాల్కన్’ గురించి సామాజిక మాధ్యమాల్లో ఎంత హడావుడి నడుస్తోందో తెలిసిందే. ఏకంగా ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఈ వ్యాన్ డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. దీని గురించి బన్నీ ట్వీట్ చేస్తూ ఫొటోలు షేర్ చేయడమే విచిత్రం. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది కానీ.. వాళ్లకు వాళ్లుగా ఈ విశేషాలు పంచుకుంటే సెల్ఫ్ భజన కు పోతున్నట్లు ఉంటుంది. మొత్తం మీద తన గురించి తన ‘ఫాల్కన్’ వ్యానిటీ వ్యాన్ గురించి…సోషల్ మీడియాలో భజన చేయటంతో.. విమర్శలు నెటిజన్ల నుండి వెల్లువెత్తుతున్నాయి.