సమంత ని సర్ ప్రైజ్ చేసిన అభిమానులు..!

వాస్తవం సినిమా: ఏ క్షణాన అయితే సమంత అక్కినేని ఇంటికి కోడలు అయ్యిందో ఆ ఇంటిలో ఉన్నవారికి అదృష్టం గా మారిపోయింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న క్రమంలో తన భర్త నాగచైతన్యతో ఇటీవల నటించిన మజిలీ సినిమాలో నటించి చైతూకి సూపర్ హిట్ వచ్చేలా చేయగా తాజాగా..నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబీ సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సినిమా యూనిట్ మొత్తం ప్రస్తుతం సక్సెస్ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇటీవల సమంత అభిమానులు సమంతా కి ఓ ఫోటో షేర్ చేస్తూ ట్విట్టర్ లో సర్ ప్రైజ్ ఇచ్చినట్లు అయ్యింది. ఓ బేబీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సమంత అభిమానులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సమంతకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెకు తన పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. వారందరికీ సమంత పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ క్రమంలో సమంత అభిమాని ఒకరు ఆమె చిన్నప్పటి ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ‘పిక్చర్ ఆఫ్ ది డే’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో చూసిన సమంత సర్ ప్రైజ్ అయింది. ‘ఈ ఫోటో మీకెలా దొరికింది’ అంటూ ఎంతో ఎగ్జైట్ అయింది. ఇదే క్రమంలో మరో సమంతా ఫ్యాన్… సమంత, చైతు, అఖిల్ ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆ ట్వీట్ పై స్పందించిన సామ్ ‘ఆ రోజు ఏం మాట్లాడుకున్నామో.. నాకు ఇప్పటికీ గుర్తుంది’ అని బదులిచ్చింది.