అతని డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తే పూనకాలే !

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ అత్యంత క్రేజ్ కలిగిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువగా ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకునే కథలు కూడా…మాస్ ప్రేక్షకులను అలరించేవిగా ఉంటాయి. ఎన్టీఆర్ కెరీర్లో కొన్ని సినిమాలు మాత్రమే క్లాస్ మూవీస్. చాలావరకు ఇప్పటి వరకు…ఎన్టీఆర్ నటించిన సినిమాలు అన్ని మాస్ సినిమాలే అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి క్రమంలో ఎన్టీఆర్ తో ఇటీవల మాస్ ప్రేక్షకులను సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆడియన్స్ కి పూనకాలు తెప్పించిన కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్.. ప్రశాంత్ నీల్…ఎన్టీఆర్ తో కలిసి పని చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ వారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కోసం చర్చకు రాగా వారు తారక్ “కేజీఎఫ్” చిత్రాన్ని చూసి బాగా నచ్చిందని అందువల్ల ప్రశాంత్ తో ఒక సినిమా చేద్దామని అడిగారని తెలిపారు..దీనికి ప్రశాంత్ నీల్ కూడా అంగీకరించినట్టుగా తెలిపారని ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఆఖరులో మొదలయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం మీద ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్‌టి‌ఆర్ కనుక ఈ సినిమా చేస్తే ఖచ్చితంగా నందమూరి అభిమానులకు పూనకాలే అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.