టీడీపీ మీద పట్టు కోల్పోయిన చంద్రబాబు ?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులు, చంద్రబాబు కి అత్యంత దగ్గరగా ఉండే సన్నిహితులే బిజెపి పార్టీలో చేరిపోవడంతో పార్టీని కంట్రోల్ చేయడానికి పార్టీపై పట్టు నిలుపుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. జరిగిన ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం తో టీడీపీ పార్టీలో ఉన్న నాయకులే టీడీపీ అధిష్టానం పై కామెంట్లు చేసే స్థాయికి ప్రస్తుతం దిగజారి పోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు పార్టీ మీద పెత్తనం చెలాయిస్తూ ,నాయకత్వ లక్షణాలు లేకపోయినా పార్టీని తన గుప్పిట్లోకి తీసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు తనయుడు లోకేష్ కారణంగా పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని కామెంట్ చేసినట్లు సమాచారం. దీంతో అధ్యక్షుడు కొడుకుపై సొంత పార్టీ నేతలే కార్యకర్తలే కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు పట్టు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.