కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి మాట్లాడిన సొంత సీఎం..?

వాస్తవం ప్రతినిధి: ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో..పార్టీలో ఉన్న సొంత నేతలే పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడటం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉద్దేశించి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో “ప్రజలు నన్ను చూసే ఓటు వేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే ముఖ్యమంత్రి పదవి ఏపట్టాను..”ఇది రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ప్రకటన. అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి డిల్లీలో ఎఐసిసి అద్యక్షుడిని చేయవచ్చన్న ప్రచారం పై ఆయన స్పందించారు. తాను డిల్లీ బాద్యతలు కోరుకోవడం లేదని, రాజస్తాన్ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి ,తనను ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతూ ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తో ఆయనకు ఉన్న విబేధాల రీత్యా ఆయనను పదవి నుంచి తప్పించవచ్చన్న వార్తలు వచ్చాయి. వాటిని ఆయన తోసిపుచ్చారు. ప్రజలు తనకు పట్టంకట్టారని భావించే రాహుల్ గాంధీ తనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారని అన్నారు.తాను ఈ పదవి నుంచి తప్పుకునేది లేదని ఆయన స్పస్టం చేశారు. తానే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని అని కూడా గెహ్లాట్ స్పష్టం చేశారు.