ఏపీ మంత్రి అనిల్ కుమార్ పై సోషల్ మీడియాలో విమర్శలు…?

వాస్తవం ప్రతినిధి: నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఏపీ లో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రాజెక్టుల విషయం గురించి చర్చకు వచ్చిన క్రమంగా ఒక మంత్రి స్థానంలో ఉండి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు పై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో…ఇప్పటికి నలభై రోజుల పాలనే అయిందని,చాలా సినిమా ముందు ఉందని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో చేసిన దోపిడీ చాలా దారుణంగా ఉందని ఆయన అన్నారు. కడప జిల్లాలో ఒక ప్రాజెక్టు పది కోట్ల వ్యయం నుంచి 130 కోట్ల కు పెంచేశారని ఆయన ఆరోపించారు. అన్ని విషయాలు బయటకు వస్తాయని, ప్రాజెక్టులలో జరిగిన అంచనాలను ఇష్టం వచ్చినట్లు పెంచారని, వాటన్నిటిని సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు. టిడిపి ఎమ్.పిలకు, ఎమ్.పిలు గా పోటీచేసిన నేతలు ఈ రకమైన కాంట్రాక్టులు పొందారని ఆయన అన్నారు. అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీ సహించలేకపోతోందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో ప్రతి ఒక్కరితో తగాదా పెట్టుకుని రాస్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన చరిత్ర వారిదని ఆయన అన్నారు. వారి ట్రాక్ రికార్డు చూస్తే ఎవరితోను పూర్తిగా శాశ్వతంగా స్నేహం చేయలేదని ఆయన అన్నారు. గోదావరి జలాలను సాగర్ ,శ్రీశైలం ప్రాజెక్టులకు తీసుకు వళ్లే ప్రతిపాదన ఇంకా ప్రాధమిక దశలోనే ఉందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒకానొక దశలో బుల్లెట్ బుల్లెట్ అంటూ …మంత్రి అనిల్ కుమార్ కాస్త ఘాటుగా మాట్లాడటంతో సోషల్ మీడియాలో..ఓ మంత్రి స్థానంలో ఉండి ఆ విధంగా మాట్లాడటం భావ్యం కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు.