చంద్రబాబు కి మరో షాక్ ఇచ్చిన కేసినేని నాని..!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో టీడీపీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ లో ఉన్న రాజ్యసభ సభ్యులు నలుగురు ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న క్రమంలో తాజాగా విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. గతంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు కి తలనొప్పిగా మారిన కేశినేని నాని ఇటీవల టీడీపీ పార్టీకి సంబంధించిన ఆత్మీయ సమావేశం లో విశాఖ పశ్చిమ నియోజవర్గం నుండి ఈసారి నాగుల్ మీరాను ఎమ్మెల్యేగా చూడాలని ఉందని అన్నారు. దీంతో పశ్చిమ టీడీపీ నేతలో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున మైనార్టీ నాయకుడు జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ పోటీచేసి ఓడిపోయారు. ఇలా నాని నాగుల్ మీరా పేరును భవిష్యత్ నాయకుడిగా అభివర్ణించడం పట్ల జలీల్ ఖాన్ వర్గం, ఎప్పటికైనా ప్రాధాన్యత దక్కపోతుందా అని ఎదురుచూస్తున్న బుద్దా వెంకన్న వర్గం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో కేశినేని నాని వ్యవహారం చంద్రబాబునాయుడికి పెద్ద తలనొప్పిగా మారినట్లు పార్టీల వినబడుతున్న టాక్. కావాలని కేశినేని నాని పార్టీలో బేధాభిప్రాయాలు తీసుకువస్తున్నారని కొంత మంది టీడీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.