ముద్రగడ మీద విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్ అభిమానులు !

వాస్తవం ప్రతినిధి: గతంలో చంద్రబాబు కాపులను బీసీ లో చేరుస్తానని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేసి పాలన కొనసాగిస్తున్న క్రమంలో కాపు జాతి తరఫున ముద్రగడ్డ పద్మనాభం చంద్రబాబుపై పోరాటానికి దిగిన క్రమంలో రాష్ట్రంలో అనేక అలజడులు నెలకొన్నాయి. ముఖ్యంగా తుని ఘటన ఎవ్వరు మర్చిపోలేనిది. కాపులకు అండగా ఉంటూ కాపు జాతి కి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆంధ్ర రాజకీయాలలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు ముద్రగడ పద్మనాభం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్న కాపులు కాపు పార్టీ అయిన జనసేన పార్టీకి కాకుండా వైసిపి పార్టీకి ఓటు వేశారని అంటూ జగన్ కి లేఖ రాసి..కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కాపుల రుణం తీర్చుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ముద్రగడ లేఖ పై పవన్ కళ్యాణ్ అభిమానులు విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాని జనసేన పార్టీ గాని…ఒక కులానికి ఒక మతానికి సంబంధించినది కాదని…ప్రజల కోసం పుట్టిన పార్టీ అని…పార్టీపై ముద్రగడ కుల ముద్ర వేయాలనుకోవడం మంచిది కాదని ముద్రగడ రాసిన లేఖపై..ఆ నేతల జనసేన పార్టీ పై ముద్రగడ అన్న మాటల పై విమర్శల వర్షం కురిపించారు.