ప్రభాస్ ని ఇరకాటం లో పెడుతున్న మోడి ?

వాస్తవం ప్రతినిధి: దక్షిణాది రాష్ట్రాలలో బలపడేందుకు చేతికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదలటం లేదు బీజేపీ. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బంపర్ మెజారిటీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ఉత్తర భారతంలో బలంగా ఉన్న నేపథ్యంలో దక్షిణ భారతదేశం పై దృష్టి సారించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా ఉన్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టడానికి బిజెపి పార్టీ పెద్దలు వ్యూహాలు పన్నుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ ప్రత్యేకమైన దృష్టి సాధించినట్లు జాతీయ మీడియా చానల్స్ లో వార్తలు వినబడుతున్న క్రమంలో…బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్ పై మోడీ కన్ను పడినట్లు సమాచారం. ముఖ్యంగా దక్షిణాదిలో సినీ గ్లామర్ నాయకులకు పెద్ద డిమాండ్ ఉన్న నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవిని పార్టీలో చేరేలా సంప్రదింపులు చేస్తూనే ‘ బాహుబలి’ ప్రభాస్ ను బీజేపీలో చేరేలా ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగానే ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ ను పార్టీలో చేరాల్సిందిగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పిలుపునివ్వడం హాట్ టాఫిక్ గా మారింది. తాజాగా సంఘటన పర్వ్ 2019 పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపీ విజయవాడలోని హోట‌ల్ ఐలాపురంలో నిర్వ‌హించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర‌మంత్రి కృష్ణంరాజు తో పాటు కొంతమంది కీలకమైన బీజేపీ నాయకులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కృష్ణంరాజు మాట్లాడుతూ, త‌న ఫ్యాన్స్, ప్రభాస్ ఫాన్స్ బీజేపీలో చేరి దేశం కోసం పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. మొత్తం మీద ఈ పరిణామం ప్రభాస్ కెరియర్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉందని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు ఈ వార్త తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు.