రామ్మోహన్ నాయుడు కుమ్మేశాడుగా !

వాస్తవం ప్రతినిధి: ఇటీవల పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోడీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై…రాష్ట్రం దారుణంగా విభజన వల్ల నష్టపోయిందని మాట్లాడుతూ ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా గురించి అలాగే నిధుల గురించి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా బిజెపి పార్టీ అధికారం లో ఉన్న రాష్ట్రాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని అంటూ ప్రధాని మోడీ దృష్టిలో అభివృద్ధి అంటే గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి చెందడమేనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా గుజరాత్‌కు గిఫ్ట్‌ సిటీగా ప్రతిపాదించారని, గుజరాత్ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ సెంటర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ప్రత్యేక పన్ను రాయితీలు కల్పిస్తున్నారన్నారు. అయితే ఏపీకి కావలసిన న్యాయబద్ధమైన డిమాండ్లను తీర్చకుండా గుజరాత్‌కి మాత్రమే కేంద్రం అదనపు రాయితీలు, అదనపు నిధులు ఇవ్వడం ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపడమేనని ఒక దేశ ప్రధానిగా ఉంటూ మోదీ ఇలా ఏకపక్ష వైఖరిని ప్రదర్శించడం సరికాదని అన్నారు. దీంతో రామ్మోహన్ నాయుడు స్పీచ్ సోషల్ మీడియాలో విన్న చాలా మంది నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది అయితే కుమ్మేశాడు అంటూ ఇలానే దూసుకెళ్లి పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించడానికి అడుగులు వేస్తుందని పేర్కొంటున్నారు.