అదరగొడుతున్న ఎన్టీఆర్ యాడ్…!

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క యాడ్ లు చేస్తూ మరోపక్క గేమ్స్ కి ప్రచారకర్తలుగా మారుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ కి ఎంత క్రేజ్ ఏర్పడిందో అదే తరహాలో ప్రో కబడ్డీ ఆట కి కూడా క్రేజ్ రోజు రోజు కి పెరుగుతోంది. తాజాగా ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 7 అలరించేందుకు సిద్ధం అవుతోంది. ప్రో కబడ్డీకి తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ప్రో కబడ్డీ ప్రచారం కోసం ఎన్టీఆర్ యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. ఆ వీడియోని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘చూసే వాడికి అది ఆటే.. కానీ ఆడేవాడికి వేట’, ‘కబడ్డీ ఇది ఆట కాదు.. వేట’ అంటూ ఎన్టీఆర్ చెబుతున్న పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రో కబడ్డీలో ఆటగాళ్ల పోరాటం ఏస్థాయిలో ఉండబోతోందో జూ ఎన్టీఆర్ యాడ్ ద్వారా నిర్వాహకులు తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ యాడ్ సోషల్ మీడియాలో అదరగొడుతోంది.

.