‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన సింగర్ చిన్మయి…!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీ లో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ క్రేజ్ ఏర్పరుచుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఆ సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు. హిందీలో కూడా సందీప్ రెడ్డి వంగా ఏ దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్ కైరా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి తక్కువ రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ ఇండస్ట్రీని ప్రస్తుతం షేక్ చేస్తోంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారుతున్నాయి. కబీర్ సింగ్ చిత్రం, తాజాగా సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల్ని అవమానించేలా ఉన్నాయంటూ ప్రముఖ గాయని చిన్మయి ట్విటర్ వేదికగా ఫైర్ అయ్యారు. సందీప్ రెడ్డి మాట్లాడిన వీడియో పోస్ట్ చేసి దుయ్యబట్టారు. ప్రేమలో ఉన్న ప్రేమికులిద్దరూ ఒకరినొకరు టచ్ చేసే చనువు ఉండాలి. అవసరమైతే ఒకరినొకరు కొట్టాలి. ఆ చనువు ప్రేమికుల మధ్య ఉండాలి. అలా లేకుంటే వారి మధ్య ప్రేమ లేనట్లే అర్థం అని సందీప్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియో పోస్ట్ చెసిన చిన్మయి.. ఒకరినొకరు కొట్టుకోవాలా.. నేను, నా భర్త ప్రేమలో ఉన్నాం.. నా భర్త నన్నెప్పుడూ కొట్టలేదు. నాపై ఉన్న ప్రేమని నిరూపించుకోవడానికి ఆయన నన్ను కొట్టాలా అని చిన్మయి ప్రశ్నించింది. ఇలాంటి సినిమాలు, కామెంట్స్ వల్ల మన పిల్లలు కూడా అలాగే తయారవుతారని చిన్మయి మండిపడింది.