అమెరికాలో షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన యాంకర్ అనసూయ…!

వాస్తవం సినిమా: ఒకపక్క యాంకరింగ్ చేస్తూ మరో పక్క సినిమా రంగంలో బిజీబిజీగా గడుపుతోంది యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమా లో యాంకర్ అనసూయ పాత్రకి మంచి మార్కులు రావడంతో…అప్పటినుండి అనసూయా కి వరుస అవకాశాలు ఇండస్ట్రీ నుండి వస్తున్నాయి. ఇటువంటి క్రమంలో కెరియర్ మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న సమయంలో యాంకర్ అనసూయ అమెరికాలో షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను నిర్మాతగా మారబోతున్నట్లు అనసూయ ప్రకటించింది. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు తాను సినిమాలు నిర్మిస్తానని అనసూయ తెలిపింది. అనసూయ సినిమాలు నిర్మించే ఆలోచనని భవిష్యతులో అమలు చేస్తుందా లేక ప్రస్తుతం ఏదైనా ప్రాజెక్ట్ సిద్ధంగా ఉందా అనేది తెలియాల్సి ఉంది. యాంకర్ స్థాయి నుంచి నటిగా ఎదుగుతున్న సమయంలో అనసూయ తీసుకున్న నిర్ణయం సంచలనమైనదే.