తమన్నా ఇంటి మీద ఇదేమి పుకారు రా బాబు !

వాస్తవం సినిమా: సెన్సేషనల్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంటి మీద తాజాగా ఒక కారు వార్త ఇండస్ట్రీలోని మరియు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళితే ముంబైలో వర్సోవా ఏరియాలో ఓ అపార్ట్‌మెంట్‌ను డబల్ రేట్ కి కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మామూలు ధర కంటే అధిక ధరకు 16 కోట్లకు అపార్ట్ మెంట్ లో ప్లాట్ కొన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తమన్నాపై వార్తలు రాసుకొచ్చాయి. దీంతో స్పందించిన తమన్నా…వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ పుకార్లేనని పేర్కొన్నారు. ఇల్లు కొన్నావా? అని తన హిందీ టీచర్‌ మెసేజ్‌ చేస్తే..‘రెట్టింపు ధరకు నేనేందుకు కొంటానని మా టీచర్‌కు చెప్పా’ అని తమన్నా చెప్పారు. దీంతో ఆ టీచర్‌ తమన్నా తరఫున ట్వీట్‌ చేశారు. అయినా సరే అభిమానులు నమ్మలేదు. తమన్నాను దీని గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీంతో ఈ అంశమై తమన్నా మళ్ళీ ఒక్కసారి స్పందించారు. ‘చాలా రోజులు అయినప్పటికీ ప్రజలు ఇదే ప్రశ్న అడుగుతుంటే నాకు విసుగొస్తోంది. నేను ఇల్లు కొన్నా, కానీ రెట్టింపు ధరకు కాదు. నేను ఒక సింధీ అమ్మాయిని.. నేను రెట్టింపు ధరకు కొన్నానంటే ఎలా నమ్ముతున్నారు. ఇంటి పనులు పూర్తయ్యాక మా తల్లిదండ్రులతో కలిసి అక్కడికి షిఫ్ట్‌ అవుతా. నాకు సింపుల్‌గా జీవించడమే ఇష్టం’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం తమన్నా చేస్తున్న సినిమాల విషయానికి వచ్చేసరికి సౌత్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తన సైరా సినిమాలో నటిస్తుండగా మరోపక్క తమిళ్ ఇండస్ట్రీలో ఆనందోబ్రహ్మ రీమేక్లో నటిస్తున్నారు.