ఈ బిగ్ బాస్ సీజన్ లో హాట్ హాట్ అమ్మాయి వస్తోంది !

వాస్తవం సినిమా: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెలివిజన్ ప్రేక్షకులకు బిగ్‌బాస్ సీజన్‌ 3 త్వరలో మొదలు కానుంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారితో పాటు సెలబ్రిటీలను హౌస్ సభ్యులు గా షో నిర్వాహకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లే సభ్యుల గురించి రోజుకో వార్త బయటకు వస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా కుమారి 21 సినిమాతో అందరికి పరిచయమైన హాట్ భామ హెబ్బా పటేల్ రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆమెకు సినిమా ఆఫర్లు కూడా పెద్దగా రాకపోవడంతో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సీజన్‌లో ఇప్పటికే అబ్బాయిల కన్నా అమ్మాయిల పేర్లు ఎక్కువగా వినబడుతుండడం శ్రీముఖి వంటి హాట్ భామకు హెబ్బా వంటి హాట్ హీరోయిన్ తోడయితే ఈ సీజన్ మొత్తం హాట్ హాట్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరి వచ్చిన ఈ వార్తల్లో హెబ్బా ఉందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.