23నుంచి అయోధ్య కేసులపై రోజువారీ విచారణ : సుప్రీంకోర్టు

వాస్తవం ప్రతినిధి: అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 23నుంచి రోజు వారి విచారణ చేపడతామని సిజెఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 18లోగా అప్పటి వరకూ ఉన్న వాస్తవ నివేదిక ఇవ్వాలని మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.

మధ్యవర్తిత్వంతో సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని గోపాల్‌ సింగ్‌ విశారద్‌ తరఫు న్యాయవాది పరాశరన్‌ ధర్మాసనానికి విన్నవించారు. రాజ్యాంగ ధర్మాసనానికి అందిన ప్రాథమిక నివేదికలో ఏదైనా చిన్న ఫలితమైనా కనిపించిందా అని పరాశరన్‌ అడిగారు. కాగా మధ్యవర్తిత్వ కమిటీకి ఆగస్టు 15 వరకూ గడువు ఇచ్చామని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. మధ్యవర్తిత్వ కమిటీ కొనసాగుతుండగానే కోర్టులో విచారణ కూడా కొనసాగించాలని పరాశరన్‌ కోరారు. ఈ నెల 23 జూలైనుంచి అయోధ్య వివాదంపై రోజువారీ విచారణ చేపడతామని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది .