కెసిఆర్‌ మంచి పనులు చేస్తుంటే అడ్డుపడటం ఎందుకు? : ఎపి సీఎం జగన్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంచి పనులు చేస్తుంటే అడ్డుపడటం మంచిది కాదని ఎపి ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఈ రోజు ఎపి అసెంబ్లిలో ప్రాజెక్టులపై చర్చ జరిగింది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ వెళ్లడంపై టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై జగన్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ మంచి పనులు చేస్తుంటే అభినందించాలని అన్నారు. అడ్డుపడటం మంచిది కాదని జగన్‌ అన్నారు.