ఈ రోజు  నుంచి ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లి సమావేశాలు

వాస్తవం ప్రతినిధి: ఈ రోజు  నుంచి ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లి సమావేశాలు కొనసాగనున్నాయి. శని, ఆదివారాల్లో ఏపీ అసెంబ్లికి సెలవు దినాలుగా నిర్ణయించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ నెల 12న శుక్రవారం సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సభలో కరవు, విత్తనాలు, వైసీపీదాడులపై చర్చించాలని టీడీపీ కోరింది.