చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్షే!

వాస్తవం ప్రతినిధి: దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కేంద్రం ముందడుగు వేసింది. పోక్సో చట్ట సవరణకు(2012) ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడేలా ఈ చట్టానికి సవరణ చేయనుంది. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరణ చేయనుంది. కఠిన శిక్షల ద్వారానే చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకడ్డ వేయడంతో పాటు అత్యాచారాలను అదుపుచేసేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది.