చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నప్పుడే ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచారు: జగన్

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచారని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఎపి అసెంబ్లిలో ప్రాజెక్టులపై చర్చలో పాల్గొన్న జగన్‌ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి 524 మీటర్ల ఎత్తు పెంచితే చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని జగన్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఏం చేశారని, ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. కుళ్లు, కుతంత్ర రాజకీయాలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లానని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించండని ఆయన అన్నారు.