జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు ఒకటే అంటున్న సామాన్య జనం..?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు ముగిశాయి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి నెల దాటిపోయింది. అయినా కానీ పాలనలో తెలుగుదేశం పార్టీని గుర్తు చేస్తున్నారు అంటే సామాన్య జనం సోషల్ మీడియాలో వైసీపీ ప్రవర్తన పై విరుచుకు పడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అసంతృప్తిగా ఉందని సోషల్ మీడియాలో అధ్యయంలో తేలింది. కేవలం వ్యక్తులు ప్రభుత్వాలు మారాయి కానీ పాలనలో ఏ మాత్రం తేడా లేదని టీడీపీ మాదిరిగానే వైసీపీ కూడా తయారయిందని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా వీరు అధికారం మారితే వారు చేసిన పనులు వారు అధికారం మారితే వీరు చేసిన పనులు జస్ట్ పేర్లు మార్చుతున్నారు తప్ప నిజమైన చిత్తశుద్ధి చూపడం లేదని సగటు సామాన్యుడు ఆవేదన చెందుతున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎంతసేపు ప్రభుత్వ పథకాలకు వారి పేర్లు వారి పార్టీ వ్యవస్థాపకులు పేర్లు పెట్టుకుంటున్నారే తప్ప దేశం కోసం కానీ మన రాష్ట్రం కోసం కానీ ప్రాణాలు అర్పించిన ఎంతో మంది గొప్ప నాయకులు స్వాతంత్ర సమరయోధులు పేర్లు పెట్టడానికి ఎందుకు మనసు రావట్లేదని అంటున్నారు. ఇలా చేసి రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధిని చేయలేరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.