అతను వెళ్ళిన వెంటనే కే‌సి‌ఆర్ కి ఎంత నష్టం జరిగిందో తెలుసా ?

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాటి నుండి తనకు ఎదురు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో దూసుకెళ్ళిపోతున్న టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కే సొంత పార్టీ నేత ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. ఇటీవల ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇక పార్టీలో పని చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్టీని వీడుతూ సోమారపు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. పార్టీలో గౌరవం లేదని అరాచకాలు పెరిగిపోయాయని నియంతృత్వ ధోరణితో నాయకులు వ్యవహరిస్తున్నారని తనని చాలా సార్లు అవమానించినా క్షమించాను అని..కానీ రోజురోజుకి పార్టీలో పరిస్థితి దారుణంగా తయారవడంతో పార్టీలో ఇమడలేక బయటకి వస్తున్నా అని చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తనకి అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని, కాని కొందరి కారణంగా పార్టీ నుంచి బయటకి వచ్చేస్తున్నా అని స్పష్టం చేసారు. అయితే ఆయనికి బీజేపీ పార్టీ నుంచి పెద్ద ఆఫర్ రావడంతోనే బయటకి వచ్చి ఆ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని టాక్. దీంతో సోమారపు వెళ్ళటంతో టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి గా ఉన్న నేతలు కూడా చాలామంది బీజేపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ పరిణామంతో కేసీఆర్ కి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.