సాక్షి ఆఫీస్ లోనే వైఎస్ కి ఘోర అవమానం..?

వాస్తవం ప్రతినిధి: ఇటీవల వై.ఎస్ 70 వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలను సాక్షి మీడియా కవర్ చేసి ప్రేక్షకులకు చూపించింది. అయితే సొంత మీడియాలో సాక్షిలో ఎక్కడా కూడా వైఎస్ జయంతి కి సంబంధించిన వేడుకలు జరగలేదని యాజమాన్యం కూడా వైయస్ జగన్ కి సంబంధించిన వేడుకల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైయస్ స్వంత మీడియా లోనే ఇలా జరగటం వైఎస్ కి ఘోరమైన అవమానం అంటూ చాలామంది ఈ విషయం తెలుసుకున్న వారు అంటున్నారు. ఇదే విషయాన్ని సాక్షి సంస్థలో ఉన్న ఆఫీస్ ఉద్యోగులు తెలియజేశారు. ప్రతి క్షణం వైఎస్ నామజపం చేసే సాక్షిలో వైఎస్ జయంతిని పట్టించుకోకపోవటం విడ్డురం. ఇలాంటి పనులను జగన్ లేదా భారతి దగ్గర ఉండి మరి చేయాలంటే అయ్యే పనికాదు. అక్కడ ఉండే మేనేజ్మెంట్ ఇలాంటివాటిని చూసుకోవాలి. కానీ వాళ్ళు కూడా మాకేమి పనిలే అన్నట్లు సైలెంట్ గా ఉండిపోవటం విడ్డురం. మరోపక్క అప్పట్లో లోటస్ పాండ్ లో వైయస్ కుటుంబం ఉన్న సమయంలో హైదరాబాదు లోనే సాక్షి మీడియా ఉండటంతో సాక్షి యాజమాన్యం వైయస్ కి సంబంధించిన కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా చక్కగా వ్యవహరించేది ఎప్పుడైతే వైఎస్..కుటుంబం మొత్తం అమరావతి తాడేపల్లి లోకి రావడంతో..సాక్షిలో యాజమాన్యం మారడంతో నూతన యాజమాన్యం కొంత నిర్లక్ష్యంగా ప్రస్తుతం వ్యవహరిస్తుందని ఇటువంటి పరిణామాలు తెలుసుకున్న వైయస్ సన్నిహితులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో వైయస్ జగన్, భారతి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.