జనసేన పై దారుణమైన ప్రచారానికి తెర లేపుతున్న ఎల్లో మీడియా..?

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో చాలా మంది టీడీపీ లో ఉన్న నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మరోపక్క జనసేన పార్టీ రోజురోజుకీ బలం అందుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో టీడీపీకి మద్దతు గా ఉండే ఎల్లో మీడియా చానల్స్ జనసేన పార్టీ పై విష ప్రచారానికి తెర లేపుతున్న ట్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతున్నాడు అంటూ ప్రచారం చేసిన ఎల్లో మీడియా తాజాగా   మరోసారి జనసేన పార్టీను ప్రజల్లో చెడుగా చిత్రీకరించేందుకు పూనుకున్నారు. ఎవరో ఏదో హత్య చేస్తే ఆ హత్యకు జనసేన పార్టీ నేతకు సంబంధం ఉంది అంటూ ఒక న్యూస్ ఛానెల్ వారు ప్రచారం చెయ్యడంతో జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఆ వ్యక్తి జనసేన పార్టీకు చెందిన వాడు కాదని వైసీపీ పార్టీకు చెందిన వ్యక్తి అని సాక్ష్యాలు చూపించి మరీ ఇక నుంచి అయినా జనసేనపై విష ప్రచారాలు మానుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తే మీ మీడియా ఛానల్ లో వచ్చే న్యూస్ కథనాలు గురించి ఎవరూ పట్టించుకోరని..విలువలను కాపాడుకోండి అంటూ కూడా సూచిస్తున్నారు.