రేషన్ డీలర్లను రద్దు చేయకూడదు : ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: రేషన్ డీలర్లను రద్దు చేయకూడదని, రేషన్ డీలర్ల ఆందోళనకు తేదేపా ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ గారు మద్దతు తెలిపారు.

రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దు చేస్తానన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ముఖ్యమంత్రి నివాస ముట్టడికి పిలుపునివ్వడం వలన, ఉయ్యూరు ప్రాంత రేషన్ డీలర్లను సిఐ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో షుమారు 25 మంది డీలర్లను మహిళలను నిర్భందం చేయగా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు , డీలర్లను పరామర్శించి మద్దతు తెలిపారు. నిర్భందం నుండి డీలర్లను విడిచిపెట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన డీలర్లవ్యవస్థపై పక్షపాతధోరణి మంచిపద్దతి కాదనీ, డీలర్ల వ్యవస్థ కొనసాగిస్తూ* , ప్రజల సౌకర్యార్థం నూతన విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు సూచించారు.

డీలర్ల వ్యవస్థ రద్దు చేయడం వలన వ్యవస్థలను నిర్వీర్యం చేయడమేనని, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కుటుంబాలు రోడ్డున పడతాయని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఉన్న వారిని తీయడం కాదని, చంద్రబాబునాయుడు గారిలా ఉత్పత్తి అవకాశాలను పెంపొందించడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు వేమూరి శ్రీనివాసరావు, కుప్పాల అంజిబాబు, కొండా ప్రవీణ్ కుమార్, బాబూ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, జంపని శ్రీను, ధూపం శివ, వల్లూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.