తన రాజకీయం లో సరికొత్త కోణం మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ ?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా గాని ఎక్కడా కూడా తగ్గకుండా ముందుండి నడిపిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలు అవ్వటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా పోరాటాలు చేయటానికి తప్ప అధికారం కోసం కాదని తన ఓటమి నుండి చాలా నేర్చుకున్నాను అంటూ మార్పు రావాలంటే ఒక్క క్షణంలో రాదని కార్యకర్తలకు తెలియజేసి ఉత్సాహాన్ని ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐదేళ్ల తర్వాత రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ అలాంటి ప్రభావం చూపించాలంటే ఇప్పటి నుంచే సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటు ఏదో ఒక కీలక అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం చేయాలని, అలా చేస్తే పవన్ కళ్యాణ్ పై ప్రజల దృష్టి పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక హోదా అనే అంశం ఎజెండాగా తీసుకుని భారీ ఉద్యమానికి తెర లేపాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ కి యూత్ సపోర్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి ఇక తిరుగుండదు అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు.