హజ్ యాత్రికులకు శుభవార్త!

వాస్తవం ప్రతినిధి: భారత్ నుంచి హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలకు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా శుభవార్త తెలిపింది. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాను సందర్శించుకున్నాక తిరుగుప్రయాణంలో ముస్లిం యాత్రికులు అక్కడి పవిత్రమైన ‘జమ్ జమ్’ నీటిని విమానంలో తెచ్చుకునేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. గతంలో జమ్ జమ్ నీటిని విమానంలో తెచ్చుకోవడంపై నిషేధం విధించామనీ, ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పింది. ప్రయాణికులకు అనుమతించిన లగేజీ పరిమితిలోనే జమ్ జమ్ నీటిని తెచ్చుకోవచ్చని పేర్కొంది.