అగ్ర రాజ్యంలో భారీ వర్షాలు..వైట్‌హౌస్‌ బేస్‌మెంట్‌లో నిండిన వరద నీరు

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని వాషింగ్టన్‌లో భారీ వర్షాలతో హఠాత్తుగా వరదలు పోటెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌ హౌస్‌లోని బేస్‌మెంట్‌ మొత్తం వరద నీటితో నిండిపోయిందని ఫాక్స్‌ న్యూస్‌ వార్త ప్రచురించింది. నగరంలో రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయని, కార్లు మూడువంతుల వరకూ నీటిలో మునిగిపోయాయని వార్తలు వెలువడ్డాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న దేశమైనా ప్రకృతి భీభత్సానికి తాను వణికిపోక తప్పడం లేదంటూ స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. వేలాదిమందిపై వరద ప్రభావం తీవ్రంగా పడింది.