భాజాపా లోకి తేదేపా ఎమ్మెల్యే..?

వాస్తవం ప్రతినిధి: తేదేపాకు కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బాబు బిగ్ షాక్ ఇవ్వ‌నున్నార‌నే చ‌ర్చ ప్రస్తుతం న‌డుస్తోంది. పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు పక్కచూపులు చూడటం టీడీపీ అధినేత చంద్రబాబును కలవరపెడుతున్నాయి. ఇప్ప‌టికే కాపునేత‌లంతా స‌మావేశం అయ్యి త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో వంశీ ఆయనతో భేటీ కావడం చంద్రబాబు దగ్గర అల్టిమేటం జారీ చేయడం వంటి పరిణామాలు రాజకీయపరంగా ఆసక్తి రేపుతున్నాయి. వల్లభనేని వంశీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.