బడ్జెట్‌ ప్రభావం తో దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌ ధరలు

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌లపై ఒక రూపాయి అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని విధించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఢిల్లిలో పెట్రోల్‌ లీటర్‌కు 2.45 రూపాయిలు పెరిగి 72.96 రూపాయిలకు చేరింది. డీజిల్‌ 2.36 రూపాయిలు పెరిగి 66.69 రూపాయిలకు చేరింది. ముంబైలో పెట్రోల్‌ 78.57 రూపాయిలకు, డీజిల్‌ 69.90 రూపాయిలకు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌ లీటర్‌ ధర 75.15 రూపాయిలకు, డీజిల్‌ 68.59 రూపాయిలకు చేరింది.