చంద్రబాబు నివాసానికి చేరుకొంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఇవాళ ఆ పార్టీ నేతలు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించనున్నారు. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తన పర్యటనను ముగించుకుని చంద్రబాబు ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. రేపు అమరావతికి రానున్నారు.