మలయాళంలో దుమ్ము దులుపుతున్న ‘రంగస్థలం’ సినిమా..!

వాస్తవం సినిమా: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అప్పట్లో అనేక రికార్డులు సృష్టించిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ సినిమా లో రామ్ చరణ్ నటనకు అప్పట్లో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు మెగా హీరోలు అభిమానులు చాలా ఆశ్చర్యపోయారు. ‘రంగస్థలం’ సినిమా అప్పట్లో ఎంతగానో టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించిన క్రమంలో తాజాగా ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందించారు. హలో కేరళ.. మలయాళంలో రంగస్థలం చిత్రం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మీ సమీపంలో ఉన్న థియేటర్లలో రంగస్థలం చూడండి అంటూ పోస్ట్ చేశాడు. చరణ్ పోస్ట్ ను ఉపాసన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కేరళలో ప్రస్తుతం పెద్ద సినిమాలు హిట్ సినిమాలు లేని సమయంలో ‘రంగస్థలం’ విడుదలైన కారణంగా మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. మలయాళంలో కాస్త ఆలస్యంగా విడుదల అయినా గాని సినిమాకి వస్తున్న ఆదరణ చూసి చాలామంది మలయాళం ఇండస్ట్రీ లో ఉన్న సినీ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు.