చరణ్ కి వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి..?

వాస్తవం సినిమా: రాజమౌళి దర్శకత్వంలో మొదలైన ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ ఇటీవల జరిగిన మొదలయ్యింది. మొన్నటివరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు గాయాల పాలు కావడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి తాజాగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో చెర్రీ యొక్క బాడీ ని చూసి రాజమౌళి గట్టిగా సీరియస్ అయినట్లు చరణ్ కి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రామ్ చరణ్ కి కాలికి గాయం అయిన సమయం నాటినుండి తాజాగా మొదలైన షూటింగ్ కి మధ్య 45 రోజుల గ్యాప్ రావడంతో రామ్ చరణ్ గతంలో వర్కౌట్ చేసిన బాడీ షేపులు మొత్తం పోవడంతో రాజమౌళి సీరియస్ అయ్యాడట. దీంతో వెంటనే రామ్ చరణ్ పై ఒత్తిడి తీసుకువచ్చి గతంలో మాదిరిగానే బాడీ ఉండాలని రామ్ చరణ్ కి సూచించారట. దీంతో చెర్రీ జక్కన్న ఒత్తిడితో అమెరికా వెళ్లి తిరిగి కావాల్సిన షేపులు తెచ్చుకునేందుకు శ్రమించబోతున్నాడట. ఆర్.ఆర్.ఆర్ ప్రారంభం అవుతోంది అనగానే చరణ్ అప్పట్లో అమెరికా వెళ్లి సరైన ట్రైనర్ సమక్షంలో షేపులు మార్చుకుని వచ్చాడు. ఇప్పుడు మరోసారి అదే శిక్షకుడి దగ్గరకే వెళుతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కారణం ఏదైనా ఏదో ఒక రూపంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణకు ఈ అడ్డంకులు తప్పడం లేదు.