హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రవర్తనకు బాధపడ్డ నితిన్…!

వాస్తవం సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రవర్తన పై కుర్ర హీరో నితిన్ బాధపడ్డారు. తాజాగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త సినిమా ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ పక్కన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమా విశేషాలను అభిమానులకు పంచుకునే రకుల్ ప్రీత్ సింగ్.. నితిన్ తో చేస్తున్న సినిమా గురించి అసలు ఏమీ పోస్టు చేయకుండా సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడంతో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రవర్తనపై బాధపడినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ వార్తలు వినబడుతున్నాయి. మరో ప్రక్క రకుల్ ప్రీత్ సింగ్ శివ కార్తికేయన్ తో చేస్తున్న సినిమా వివరాలను ఎప్పటికప్పుడు తన అభిమానులకు అందుబాటులో పెడుతోంది. రీసెంట్ గా ఆ చిత్రం సెకండ్ షెడ్యుల్ ప్రారంభమైందని ఇన్‌స్టాగ్రాం లో షేర్ చేసింది. అంతేకాకుండా హాట్ మ్యాగజైన్ ఫొటో షూట్స్, ర్యాంప్ వాక్ ల మీద దృష్టి పెడుతోంది. అలాగే తన బాలీవుడ్ సినిమా , మిగతా రిలీజ్ లను ప్రమోట్ చేస్తోంది. అలాంటిది నితిన్ సినిమా గురించి ఒక్క మాటా మాట్లాడకపోవటం నితిన్ అభిమానులకు బాధ కలిగిస్తోంది.