‘సాహో’ సినిమా లో రివీల్ అయిన ప్రభాస్ పాత్ర..!

వాస్తవం సినిమా: బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలయి ఈ సినిమా పై అంచనాలు విపరీతంగా పెంచేసింది. టీజర్ బట్టి చూస్తే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కోసం అప్పట్లో దుబాయ్ వంటి దేశాల్లో భారీ షెడ్యూలు కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ ఇంకా అనేక భాషల్లో ఆగస్టు 15వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే ప్రభాస్ పోషించిన పాత్ర. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు క్లియర్ కట్ గా అందరికీ అర్థమైపోయింది. ఎలాగంటే ఇటీవల విడుదలైన టీజర్ లో ప్రభాస్ డ్రైవ్ చేస్తున్న బైక్ పై పోలీస్ అని ఉండటంతో ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అని అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. గతంలోనే చాలామంది అభిమానులు ‘సాహో’ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్ర పోషిస్తున్నట్లు కామెంట్ చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు అదే కామెంట్ బలపరుస్తూ టీజర్ లో ప్రభాస్ బండి పై పోలీస్ అని రాయటం ద్వారా సినిమాలో ప్రభాస్ పోలీస్ అని తేలిపోయింది.