బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కబీర్ సింగ్..!

వాస్తవం సినిమా: తెలుగులో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇటీవల శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ నీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా ఏ బాలీవుడ్లో కూడా కబీర్ సింగ్ నీ డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ కైరా అద్వాని హీరో హీరోయిన్లుగా నటించారు. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో శుక్రవారం విడుదలైన రోజే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా కళ్ళు చెదిరిపోయేటట్టు 20.21కోట్లను వసూలు చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. రెండవ రోజు అయితే 22.71కోట్లతో నిర్మాతల ధైర్యాన్ని పెంచింది. మొత్తంగా సినిమా రెండు రోజుల కలెక్షన్స్ 42.92కోట్లు. ఇదే జోరు కొనసాగితే షాహిద్ కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని చెప్పవచ్చు. చూస్తుంటే 100కోట్ల క్లబ్ లో చేరడానికి కబీర్ సింగ్ కి పెద్దగా టైమ్ పట్టేలా లేదు. మొత్తానికి దర్శకుడు సందీప్ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు. ఈ బాక్స్ ఆఫీస్ హిట్ తో మనోడు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.