‘మహర్షి’ ఖాతాలో మరో రికార్డు!

వాస్తవం సినిమా: మహేష్ బాబు కెరియర్ లో 25వ సినిమా గా వచ్చిన ‘మహర్షి’ సినిమా ఈ వేసవి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఈ సినిమా మహేష్ బాబు   చేసిన అన్ని సినిమాలలో కెల్లా ఓపెనింగ్స్ విషయంలో ‘మహర్షి’ సినిమా చాలా రికార్డులు సృష్టించింది. మే 9న విడుదలైన ఈ సినిమా 103 కోట్లకుపైగా షేర్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే త్వరలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ 50 రోజుల వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఈ రోజుల్లో 25 రోజులకే థియేటర్స్ లో కనిపించకుండా పోతున్నాయి. అయితే సూపర్ స్టార్ సినిమా మాత్రం పాత రికార్డుల్ని మళ్ళీ గుర్తు చేసింది. దీంతో చిత్ర యూనిట్ 50 డేస్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేస్తోంది. జూన్ 28కి శిల్పాకళా వేదికలో వేలాది మంది అభిమానుల నడుమ ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. జరగబోయే ఈ వేడుకకు ఇండస్ట్రీ లో ఉన్న సినీ ప్రముఖులు కూడా ముఖ్య అతిథులుగా రానున్నారు.