భారతదేశ చరిత్రలో 1975 జూన్‌ 25 చీకటి రోజు : మోదీ

వాస్తవం ప్రతినిధి: భారతదేశ చరిత్రలో 1975 జూన్‌ 25 చీకటి రోజని ప్రధాని మోడీ అన్నారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ ఆ రోజు ప్రకటించిన ఎమర్జెన్సీని భయం లేకుండా ఎదిరించిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌ చేస్తున్నట్లు మోడీ చెప్పారు. ఈ సందర్భంగా ‘ది స్టోరీ ఆఫ్‌ ఎమర్జెన్సీ’ పేర ఒకటిన్నర నిముషం నిడివిగల మాంటేజ్‌లో ఇందిరా గాంధీ పత్రికా స్వేచ్ఛను, హక్కులను ఎలా అణగద్రొక్కారో వివరించారు.