మంత్రి పై సీరియస్ అయిన సీఎం జగన్…?

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ప్రజా వేదిక భవనంలో కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ కలెక్టర్లకు, మంత్రులకు, అధికారులకు.. ప్రజలకు తాను ఏం చేయాలనుకుంటున్నారు అన్న విషయాన్ని అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా అవినీతి ఏ స్థాయిలో కూడా రాష్ట్రంలో ఉండకూడదని సామాన్యులు, పేదవాళ్లు నిర్భయంగా బతికేలా ప్రభుత్వాలు అధికారులు పనిచేయాలని ప్రజలకు సేవకులుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి జగన్ మందలించిన తీరు ఆసక్తికరంగా ఉంది. మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వైఎస్సార్‌ అభయహస్తంపై చర్చ వచ్చినప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్‌ అధికారులను తప్పుబట్టేలా మాట్లాడటంతో ముఖ్యమంత్రి సున్నితంగా మందలించారట. ‘శ్రీనూ.. అధికారులు, మనం వేర్వేరు కాదు. మనం టీంగా పనిచేయాలి. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో లేమన్నది గుర్తుంచుకోవాలి’అని సలహా ఇచ్చారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని రైతాంగం నుంచి 13 ప్రభుత్వ, ప్రైవేటు బీమా కంపెనీలు రూ.40 వేల కోట్లు ప్రీమియం రూపంలో వసూలు చేశాయని, వాటికి రూ.15 వేల కోట్ల లాభం వచ్చిందని జగన్‌ తెలిపారు. దానికి తగ్గట్టు బీమా కంపెనీలు సేవలందించలేదని వివరించారు. అందుకే రైతులందరికీ బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.