విదేశీ పర్యటన ముగించుకుని నేడుహైదరాబాద్‌ రానున్న చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఈ నెల 19న కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 26న చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు. అదే రోజు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. పార్టీలో పరిణామాలపై చర్చ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.