ఆ నినాదం ఎత్తుకొని జగన్ కి ప్రత్యామ్నాయం గా మారుతున్న పవన్ కళ్యాణ్..!

వాస్తవం ప్రతినిధి:  పవన్ కళ్యాణ్ ఓడిపోయిన కానీ ప్రజా పోరాటాలలో వెనుకాడేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేయకూడదని ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు పోరాటాలకు సిద్ధపడాలని…తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు రక్తం ధారపోసి పోరాటాలు చేసే రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉన్న పోరాట పటిమ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఉందో లేదో తనకు తెలియదని ప్రత్యేక హోదాపై ప్రజల నుండి స్పందన వస్తేనే ఏదైనా చేయగలం అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ కి ఇంకా టైం ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీంతో చాలామంది రాజకీయ విశ్లేషకులు ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకొని పవన్ కళ్యాణ్.. జగన్ కి ప్రత్యామ్నాయం గా మారుతున్నారు అంటూ అది పవన్ కళ్యాణ్ కి ప్రమాదం అని..గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైజాగ్ నగరం లో ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్న సమయంలో ప్రజలకు మద్దతుగా వచ్చినా జగన్ ని వైజాగ్ విమానాశ్రయంలో అరెస్టు చేయడం జరిగింది…ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రాకుండా కేవలం సోషల్ మీడియా లో ఉంటూ కామెంట్లు, పోస్టులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అని పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి మీడియా ముందే మద్దతు తెలపడం జరిగింది . ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంటే ప్రజలు నమ్ముతారో లేదో చూడాలి. మరోపక్క ప్రత్యేక హోదాపై జగన్ కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రానికి గుర్తు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై త్వరలో పిలవబోయే పిలుపుకు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.