రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పిన సీ ఎం జగన్!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలోని రైతులందరికీ 9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్తు అందించడంపై అధికారులు తక్షణమే ప్రణాళికలు రుపొందించా లని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులను కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌కు సంబంధించి ఫీడర్ల వారీగా ప్రణాళిక ఇవ్వాలని, దీనిపై యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించాలని సీఎం ప్రశ్నించగా, దాదాపు 57 వేలకుపైగా పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు వెల్లడించారు. వీటిని నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని సూచించారు. రైతులకు ఉచిత విద్యుత్తు అంశాన్ని ప్రాధాన్యత అంశంగా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. ప్రతి పౌరుడూ ఒక చెట్టును నాటాలని, ఐదుకోట్ల మంది ప్రజలు ఐదుకోట్ల చెట్లు నాటలన్నది తన ఆలోచన అని, దీనిని ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలం టీర్లను భాగస్వాములుగా చేయాలని, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యా లయాలు, పరిశ్రమలు, ఆస్పత్రుల్లో కూడా చెట్లను నాటాలన్నారు. 25 కోట్లకుపైగా చెట్లను నాటేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. చెట్ల సంరక్షణ బాధ్యతలను సీఎస్‌ఆర్‌ కింద పరిశ్రమలకు ఇవ్వాలని, మొక్కల నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపాలని అన్నారు.